ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ఇంతవరకు కేసులు నమోదు కాలేదని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అసెంబ్లీలో అన్ని విషయాలు స్పష్టంగా చెప్పామని తెలిపారు. ఆడుదాం ఆంధ్రలో ఎలాంటి అవినీతి జరగలేదని... అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని చెప్పారు. ఈ వ్యవహరంలో తనకు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఎలాంటి సబంధం లేదని చెప్పారు. ఆడుదాం ఆంధ్రలో అంతా పారదర్శకంగా జరిగిందని తెలిపారు.వైసీపీలో ఉన్న బలమైన నేతలను తొక్కడానికి తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తారనే భయంతోనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. తనను అరెస్ట్ చేసి సంబరాలు చేసుకోవాలనే ఆశ వారికి ఉందని చెప్పారు. పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రోజా విమర్శించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పండిస్తున్నారని చెప్పారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా మారిపోయారని విమర్శించారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో కూడా పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. రెడ్ బుక్ కోసం కాకుండా... ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వం పని చేయాలని చెప్పారు.
![]() |
![]() |