అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా టారిఫ్‌లు, వాణిజ్య పరమైన అసమతుల్యత గురించి మాట్లాడుతూ.."భారత్ చాలా చాలా కఠినమైనది. ప్రధాన మంత్రి ఇప్పుడే వెళ్లిపోయారు. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. కానీ మీరు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదు. వారు మాకు 52% టారిఫ్‌లు వసూలు చేస్తే, మేము వారికి దాదాపు ఏమీ వసూలు చేయము," అని ట్రంప్ అన్నారు.భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో..) ట్రంప్ ప్రతీకార సుంకాలపై ప్రకటన చేశారు. తాను విధించిన టారిఫ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ అన్నారు. కానీ, 26 శాతం టారిఫ్‌లో.. 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు అంటున్నాయి. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చెబుతోంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన చేసే వేళ భారత ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు.
![]() |
![]() |