నెల్లూరు రూరల్ పరిధిలోని ఒకటో డివిజన్ నారాయణరెడ్డిపేటలో గురువారం టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 46వ రోజు గడపగడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. స్థానికంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |