ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 07:47 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన కేబినెట్ సమవేశం ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ను డీమెర్జ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఏపీడీసీ (ఆంధ్రప్రదేశ్ డ్రోన్‌ కార్పొరేషన్‌)ను ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌) నుంచి సపరేట్ చేసి.. స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో డ్రోన్‌ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్‌ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది.


నూతన సమగ్ర ఏపీ స్టేట్ మీడియా అక్రిడేషన్ రూల్స్-2025 నిబంధనలకు కేబినెట్ ఓకే చెప్పింది. రాష్ట్రంలో త్రీస్టార్‌ సహా ఇతర ప్రీమియం హోటళ్ల అభివృద్ధికి బార్‌ లైసెన్స్‌ ఫీజును తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.. బార్‌ లైసెన్స్‌ల ఫీజును రూ.25లక్షలకు కుదించారు. అనకాపల్లి జిల్లాలో క్యాపిటివ్‌ పోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖలో వివిధ జీవోల రేటిఫికేషన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్‌కు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఇచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించారు.


రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు.. జలహారతి కార్పొరేషన్‌ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయనున్నారు. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అలాగే ప్రధాని మోదీ అమరావతి పర్యటన అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.


మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పర్యటించనున్నారు.. ఆయన చేతుల మీుదగా రాజధాని అమరావతి పనులను తిరిగి ప్రారంభించనున్నారు. అమరావతిలో అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి సీఎస్ విజయానంద్ సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తిస్థాయి ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల పీ-4 కార్యక్రమం ప్రారంభించిన ప్రాంతంలో 50 ఎకరాలకు పైగా చదును చేయాలని చెప్పారు.. పార్కింగ్ ఏర్పాట్లకు ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని సూచనలు చేశారు. గతంలో ప్రధాని పర్యటనల్లో పనిచేసిన అధికారుల జాబితా సిద్ధం చేసి.. వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి.. డీజీపీ, సీఆర్‌డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆ ప్రాంతాన్ని సందర్శించాలని ఆదేశించారు. సమగ్ర నివేదిక అందజేయాలని సూచించారు. గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన సమయంలో కూడా వివిధ పనుల నిర్వహణను, మంత్రులు, అధికారులతో కమిటీలను నియమించిన విషయాన్ని సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా గుర్తుచేశారు. ఇప్పుడు కూడా కమిటీలను వేయాలని సూచన చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com