ఇకపై రైలులో మీ ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా చింతించాల్సిన పనిలేదు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), టెలికమ్యూనికేషన్ శాఖకు చెందిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌తో జతకట్టింది. మీ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను దీని ద్వారా తిరిగి పొందేందుకు వీలు కలుగుతుంది.ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ మాట్లాడుతూ... పోగొట్టుకున్న లేదా కనిపించకుండా పోయిన మొబైల్ ఫోన్‌లను తిరిగి పొందేందుకు డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ప్రయాణికులకు పారదర్శకమైన మరియు సమర్థవంతమైన విధానాన్ని అందించడమే తమ లక్ష్యమని అన్నారు.
![]() |
![]() |