వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరస్వతి పవర్ షేర్ల ఎంవోయూపై జగన్ స్వయంగా సంతకాలు చేశారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా తనకు జగన్ ఇవ్వలేదని తెలిపారు. తమ తల్లి విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారని... ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని పట్టుబడుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడు, మేనకోడలు ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.
![]() |
![]() |