రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకం కొనసాగుతోంది. ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా, ఈరోజు మరో 38 కమిటీలకు ప్రభుత్వం నియామకాలు చేసింది. ఇందులో 31 టీడీపీకి, 6 జనసేనకు, ఒకటి బీజేపీకి దక్కింది. త్వరలోనే మిగతా కమిటీలకు ఛైర్మన్లను ప్రకటిస్తామని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 218 మార్కెట్ కమిటీలు ఉన్నాయి.
![]() |
![]() |