నేపాల్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. గర్ఖాకోట్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో, 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. శుక్రవారం సాయంత్రం గం.7.52 నిమిషాలకు ఇది సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.ఈ భూకంపం ఉత్తర భారతదేశాన్ని కూడా తాకింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పలుచోట్ల భూప్రకంపనలు సంభవించాయి.వారం రోజుల క్రితం మయన్మార్‌లో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మయన్మార్‌లో 3,000 మందికి పైగా మృతి చెందగా, 4,500 మందికి పైగా గాయపడ్డారు. మరో 341 మంది కనిపించకుండా పోయారు.
![]() |
![]() |