భారత ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే తమ దేశం మిత్ర దేశాధినేతలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం 'శ్రీలంక మిత్ర విభూషణ'ను అందజేశారు. దీనిలోని ధర్మ చక్రం ఇరు దేశాల సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. మధ్యలో ఉండే కలశం శ్రేయస్సును, తొల్మిది విలువైన రత్నాలు ఇరు దేశాల మధ్య శాశ్వతమైన స్నేహాన్ని సూచిస్తే... సూర్యుడు, చంద్రుడు కాలాతీత బంధానికి సూచిక. ఇలా ఇవన్నీ ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాన్ని సూచిస్తాయి. కాగా, ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన కోసం శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే.
![]() |
![]() |