అనంతపురంలోని ఆర్. అండ్. బి అతిథి గృహానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే. సురేశ్ రెడ్డి శనివారం వచ్చారు. హైకోర్టు న్యాయమూర్తిని కదిరి న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
కదిరి చుట్టుపక్కల 10 మండలాలు ఉన్నాయని, ఇక్కడి ప్రజలు జిల్లా కోర్టుకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారన్నారు. కదిరిలో అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని హైకోర్ట్ జడ్జికి వినతిపత్రం సమర్పించారు.
![]() |
![]() |