మానవాళికి ఆదర్శనీయుడు శ్రీరామచంద్రుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాముని చరితం చాలా గొప్పదని, రామబాణం పరాక్రమానికి నిదర్శమన్నారు. శ్రీరాముడి పాలనలో అయోధ్యానగరం సుభిక్షంగా, సస్యశ్యామలంగా విరాజిల్లిందన్నారు.
ప్రతి దంపతులు సీతారాముల్లాగా జీవించగలిగితే ధార్మికతతో పాటు సుఖశాంతులు వర్ధిల్లుతాయన్నారు. ఈ సందర్భంగా నియోజక వర్గ ప్రజలుకు శ్రీకాంత్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
![]() |
![]() |