ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మచిలీపట్నంలోని ఓ నగల దుకాణంలో చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 05, 2025, 08:58 PM

మచిలీపట్నంలోని ఓ నగల దుకాణంలో చోరీ జరిగింది. ఇది సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. మచిలీపట్నంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దుకాణంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. అతడు మాస్క్ ధరించి ఉన్నాడు. నగలు చూస్తున్నట్టు ఏమార్చి, తనను ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకుని ఓ బంగారు కడియాన్ని ఎంతో నేర్పుగా కొట్టేశాడు. ఆ దుకాణంలోని సేల్స్ మెన్ ఇతర కస్టమర్లకు నగలు చూపిస్తూ బిజీగా ఉండడంతో, అతడిని ఎవరూ పట్టించుకోలేదు. అయితే, అతగాడి హస్త లాఘవం అంతా సీసీ టీవీ కెమెరాలకు చిక్కింది. ఈ ఘటన రెండ్రోజుల క్రితం జరిగింది. చోరీకి గురైన బంగారు కడియం 30 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com