ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశవ్యాప్తంగా పేరుగాంచిన రామాలయాలు ఇవే

national |  Suryaa Desk  | Published : Sat, Apr 05, 2025, 09:05 PM

 హిందువులకు శ్రీరాముడు అంటే ఎంతో భక్తి. ఆదివారం రోజున శ్రీరామ నవమి పండగ జరగనుంది. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండగల్లో ఈ శ్రీరామనవమి ఒకటి.  హిందువుల 5 శతాబ్దాల కల నెరవేరుతూ 2024 జనవరి 22వ తేదీన శ్రీరాముడి జన్మస్థలం అయిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో దివ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరుపుకుంది. గతంలో అక్కడ రామాలయం ఉండగా.. దాన్ని ముస్లిం పాలకులు కూల్చేసి బాబ్రీ మసీదు నిర్మించారని ఎప్పటినుంచో హిందువులు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. అయితే శరవేగంగా నిర్మాణం జరుపుకున్న అయోధ్య రామాలయంలో గతేడాది బాలరాముడు కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఇప్పుడు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా.. శ్రీరాముడి ప్రముఖ ఆలయం అంటే అందరి చూపు అయోధ్య వైపే చూపిస్తాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్యనే కాకుండా మన దేశంలో ఉన్న మరిన్ని ఫేమస్ రామాలయాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం.


శ్రీరామ నవమి రోజున రామాయణం పఠనం, దేవాలయాల సందర్శనం, ఉపవాసం, భజనలు, కీర్తనలు ఆలపించడం సహా మరెన్నో హిందువులు జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలకు ఉత్తమ సమయం ఉదయం 11:08 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక రామ నవమి మంచి చెడుపై విజయాన్ని సూచిస్తుందని.. సత్యం, నీతి మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తుందని పేర్కొంటున్నారు.


మన దేశంలో తప్పకుండా సందర్శించాల్సిన రామాలయాలు


అయోధ్య రామాలయం (ఉత్తర్‌ప్రదేశ్)


హిందువుల శతాబ్ధాల కల నెరవేరుతూ 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముడి ఆలయం ప్రాణప్రతిష్ఠ జరుపుకుంది. ఈ అయోధ్య రామాలయం ప్రారంభమైనప్పటి నుంచి రికార్డు స్థాయిలో సందర్శకులు బాలరాముడిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. శ్రీ రాముని జన్మస్థలమైన అయోధ్యలో ఈ బాలరాముడి దేవాలయం ఉండటంతో తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతాల్లో ఇది ఉంది. అయోధ్యలోని మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగి బాలరాముడి ఆలయానికి వెళ్లొచ్చు. ఇక రైలు మార్గంలో వెళ్లే వారు అయోధ్య ధామ్ జంక్షన్‌లో దిగి వెళ్లొచ్చు.


భద్రాచలం (తెలంగాణ)


తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నది తీరంలో భద్రాచంల వద్ద ఉన్న ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం. ఈ భద్రాచలం క్షేత్రాన్ని దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు కొలువై ఉన్నారు. స్థల పురాణం ప్రకారం, భద్రుడు అనే భక్తుడి తపస్సుకు మెచ్చి శ్రీరాముడు ఇక్కడ వెలిశాడని చెబుతారు. 17వ శతాబ్దంలో భక్త రామదాసు (కంచెర్ల గోపన్న) ఈ భద్రాచలం ఆలయాన్ని నిర్మించారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు సందర్శించి ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ నుంచి 325 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భద్రాచలం పుణ్యక్షేత్రానికి రోడ్డు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.


ఒంటిమిట్ట రామాలయం (ఆంధ్రప్రదేశ్)


ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది.


కాలారామ మందిరం (మహారాష్ట్ర)


శ్రీరాముడు వనవాస సమయంలో నివసించిన స్థలంలో ఈ కాలారామ మందిరం నిర్మితమైంది. మహారాష్ట్ర నాసిక్‌ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.


రామ తీర్థ దేవాలయం (పంజాబ్)


పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రామ తీర్థ దేవాలయం రామాయణ కాలానికి చెందినదని చెబుతారు. శ్రీ గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, అమృత్‌సర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లలో దిగి ఈ రామ తీర్థ దేవాలయానికి చేరుకోవచ్చు.


రామనాథస్వామి దేవాలయం (తమిళనాడు)


తమిళనాడు రామేశ్వరంలోని ఈ రామనాథ స్వామి దేవాలయం శివుని జ్యోతిర్లింగంతో పాటు శ్రీ రామునికి బాగా ప్రఖ్యాతి గాంచినది. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ల నుంచి ఈ రామనాథ స్వామి ఆలయానికి చేరుకోవచ్చు.


రామ మందిరం (ఒడిశా)


ఒడిశా భువనేశ్వర్‌లోని రామ మందిరం.. శ్రీ రాముడు, సీత, లక్ష్మణుని విగ్రహాలతో ప్రసిద్ధి చెందింది. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ రామ మందిరం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com