జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా ఇబ్బందికర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు కుమారపురం గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు, విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వరకు నిర్మించిన తారు రోడ్డును నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. జై వర్మ, జై టీడీపీ అని టీడీపీ కార్యకర్తలు... జై పవన్ కల్యాణ్, జై జనసేన అంటూ జనసేన కార్యకర్తలు జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. ఒకరినొకరు తోసుకునే పరిస్థితి అక్కడ ఏర్పడింది. ప్రారంభోత్సవాలకు టీడీపీ ఇన్చార్జ్ వర్మకు ఆహ్వానం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. నిన్న గొల్లప్రోలులో అన్న క్యాంటీన్ ఏర్పాటు సందర్భంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. ఈ క్రమంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు భారీ బందోబస్తుతో నాగబాబు వచ్చారు. అయినప్పటికీ ఈరోజు కూడా నిన్నటి సీన్ రిపీట్ అయింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
![]() |
![]() |