పరుపుపై పడుకుంటే చాలా మందికి వెన్ను, మెడ నొప్పి సమస్యలొస్తుంటాయి. వారు నేలపై పడుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నేల లాంటి గట్టి ఉపరితలాలు సహజ వక్రతకు సపోర్ట్ నిస్తాయి. వెన్నెముకని సరిగ్గా ఉంచి, వెన్నునొప్పిని తగ్గించంలో సాయపడతాయి. నేలపై పడుకుంటే పరుపులు, దిండ్ల ఒత్తిడి ఉండదు. మంచి రక్త ప్రసరణ ఉండి, కంటినిండా నిద్రపోతారు.
మీరు నేలపై పడుకున్నప్పుడు వెన్నుపాము దృఢంగా ఉంటుంది. మీరు మంచం మీద పడుకున్నప్పుడు వెన్నుపాము వంగిపోతుంది. ఇది నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది. నిజానికి వెన్నుపాము కేంద్ర నాడీ వ్యవస్థకు అనుసంధానమై ఉంటుంది. కాబట్టి నేలపై నిద్రించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది: నిజానికి నేలపై పడుకోవడం వల్ల భుజం, తుంటి కండరాలకు గొప్ప ఉపశమనం ఉంటుంది. కండరాల వల్ల తరచుగా వెన్నునొప్పి, భుజం నొప్పి, మెడ నొప్పి మొదలైన సమస్యలు ఉంటాయి. నేలపై పడుకుంటే ఈ సమస్యలన్ని పరిష్కారమవుతాయి.
రక్తప్రసరణ అదుపులో ఉంటుంది: నేలపై పడుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల కండరాలకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. నేలపై పడుకోవడం వల్ల మెదడుకు ప్రశాంతత లభిస్తుంది. ఇది స్వయంచాలకంగా ఒత్తిడిని తగ్గిస్తుంది.
![]() |
![]() |