తన వారసులకు కొంత మొత్తమే తన ఆస్తిపాస్తులను ఇస్తాననిమైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్ పేర్కొన్నారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తన ముగ్గురు పిల్లలకు ఎంతెంత ఆస్తిని ఇవ్వనున్నారో చెప్పారు. ఫిగరింగ్ ఔట్ విత్ రాజ్ షామానితో పాడ్‌కాస్ట్‌లో బిల్‌గేట్స్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. బిల్‌గేట్స్ సంపద 155 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఇందులో కేవలం 1 శాతం మాత్రమే తన ముగ్గురు పిల్లలకు ఇస్తారట బిల్‌గేట్స్. వారికి మంచి విద్యను అందించానని, తండ్రి కూడబెట్టిన ఆస్తిపై ఆధార పడకుండా వాళ్లు సొంతంగా సంపాదించుకోగలరనే నమ్మకం తనకు ఉందని అన్నారు గేట్స్. అయితే వారు సొంతంగా సంపాదించుకునేలా, విజయం సాధించేలా అన్ని అవకాశాలను మాత్రం కల్పిస్తానన్నారు.
1 శాతం తన వారసులకు పోనూ మిగిలిన 99 శాతం సంపదను దాతృత్వానికే ఖర్చు పెడతానని చెప్పుకొచ్చారు. సంపన్న కుటుంబాల విలువల ఆధారంగా వారి వారసత్వ ఎంపికలు ఉంటాయని బిల్‌గేట్స్ వెల్లడించారు. ప్రస్తుతం బిల్‌గేట్స్ సంపద 155 బిలియన్ డాలర్లు కాగా.. అందులో ఒక్క శాతం అంటే 1.55 బిలియన్ డాలర్లు మాత్రమే తన పిల్లలకు అందజేస్తానన్నారు. అంటే సుమారు లక్ష కోట్ల రూపాయలు అన్నమాట. గేట్స్ సంతానం తన అంత సుసంపన్నులు కాకపోయినా వారి సంపద కూడా తక్కువేమీ కాదు.
గేట్స్, మెలిండాక ముగ్గురు సంతానం. వారి పేర్లు.. జెన్నిఫర్ గేట్స్ నస్సార్, రోరీ గేట్స్, ఫోబ్ గేట్స్. గేట్స్, మెలిందా గతంలోనే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా వారసులకు ఆస్తినంతా కట్టబెట్టకూడదని నిర్ణయించుకున్న వారిలో ఇంకా కొంతమంది ప్రముఖులు ఉన్నారు. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా దాతృత్వానికే తమ సంపదలో అత్యధిక భాగాన్ని కేటాయించారు.
![]() |
![]() |