సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి. ఈ క్రమంలో చోరీ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గత నెల 19నే ఈ విషయాన్ని గుర్తించిన కియా ప్లాంట్ యాజమాన్యం పోలీసులకు అనధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం బయటపడితే పరువు పోతుందని భావించి ఇలా చేసింది. అయితే అధికారికంగా ఫిర్యాదు చేయకుండా తాము దర్యాప్తు చేయడం కష్టమవుతుందని పోలీసులు వారికి తేల్చిచెప్పడంతో ఆ తర్వాత అధికారికంగానే ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో సంస్థ మాజీ ఉద్యోగులే వీటిని ఎత్తుకెళ్లి ఉంటారని తేలింది. దీంతో వారి కోసం గాలింపు చేపట్టారు.
![]() |
![]() |