ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. 'మార్క్ శంకర్‌కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను' అని CM 'X' వేదికగా వెల్లడించారు. కాగా, మార్క్ శంకర్ కాళ్లకు స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం 8 ఏళ్ల వయసున్న మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని చిరంజీవి పేర్కొన్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు అయ్యాయనే విషయం తెలిసి ఏపీ మంత్రి నారా లోకేష్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. ఈ మేరకు వీరు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
![]() |
![]() |