ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు డైరెక్టర్ కుబేర్ యాదవ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
మార్కెట్ యార్డు డైరెక్టర్ గా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీపీ కంబాలపల్లి చిత్తప్ప, నగేష్ యాదవ్, పెరుగుపాళ్యం సర్పంచ్ తిమ్మరాజు, యాటకల్లు బెస్త ఆంజనేయులు పాల్గొన్నారు.
![]() |
![]() |