ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కునాల్‌ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట

national |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 02:06 PM

ప్రముఖ కమెడియన్‌ కునాల్‌ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. కామెడీ ప్రోగ్రామ్‌లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పిటిషన్‌ను ఈ నెల 16న విచారిస్తానని అప్పటి వరకు కునాల్‌ కమ్రాను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది.ఇటీవల ‘నయా భారత్’ అనే స్టాండప్ కామెడీ షోలో కునాల్‌ కమ్రా డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ‘గద్దార్‌’ (ద్రోహి) గా పేర్కొంటూ ఓ పేరడీ పాటను ఆలపించారు. దీనిపై వివాదం చెల‌రేగింది. డిప్యూటీ సీఎంను అవమానించారంటూ శివ‌సేన ఎమ్మెల్యే ముర్జీ ప‌టేల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దాంతో కునాల్ క‌మ్రాపై ఖార్‌ పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com