పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంపై మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా స్పందించారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు కలిగి ఆరోగ్యవంతుడై కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుడ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం సింగపూర్ వెళ్లనున్నారు
![]() |
![]() |