రైల్వేకోడూరు మండలం ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలో కడప - చెన్నై జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల లోడుతో తిరుపతి నుండి రైల్వే కోడూరు కు వస్తున్న బోలెరో మ్యాక్స్ వాహనం బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదం ఘటనపై తమకు సమాచారం అందలేదని రైల్వేకోడూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ బాబు తెలిపారు.
![]() |
![]() |