ఏజెన్సీ గ్రామాల్లో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి బాధితులు అధికంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. జన్యు లోపాలు, ఇతర కారణాలతో పుట్టే పిల్లలకు పోషకాహార లోపం ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. దీనిని అధిగమించడానికి దృష్టి సారిస్తాం. మెరుగైన పోషక పదార్ధాలు పిలల్లకు అందించేందుకు అంగన్వాడీలతో అనుసంధానం చేసి ప్రత్యేక పోషక పదార్ధాలు అందేలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడతాను. పాడేరులో కూడా గర్భిణీలకు సంబంధించి ఆసుపత్రిలో సరైన వసతులు లేవని నా దృష్టికి వచ్చింది. స్కానింగ్ పనిచేయడం లేదని, రేడియోలజిస్ట్ లేరని తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాను అని హమి ఇచారు
![]() |
![]() |