తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో మహిళల కంటే పురుషులకే అధికంగా గుండెపోటు వస్తున్నట్లు తేలింది. దీని ప్రధాన కారణం పురుషుల్లో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్లు అని తెలిసింది. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్లు నెలసరి టైంలో విడుదల కావడంతో ఈ ముప్పు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అయితే దీని ముప్పు తగ్గించుకోవాలంటే పురుషులు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, రోజు వ్యాయామం చేయాలని వైద్యులు చెబుతున్నారు.హెల్త్-టెక్ సంస్థ, హెల్తీయన్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో ప్రతి 10 మంది భారతీయులలో ఆరుగురికి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా అసాధారణ స్థాయిలో ఉందని తేలింది. 31 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు చెడు కొలెస్ట్రాల్ అత్యధికంగా ఉన్నట్లు తేలింది. 63 శాతం మంది రక్తంలో అధిక LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) కొలెస్ట్రాల్‌ను కలిగి ఉన్నట్లు అధ్యయనం కనుగొంది. భారతదేశంలోని 250 నగరాల్లో 20 ఏళ్లు పైబడిన 2.66 మిలియన్ల మంది వ్యక్తులపై నిర్వహించిన రక్త పరీక్షల డేటాను ఈ సంస్థ ఉపయోగించి.. పరిశోధనలు నిర్వహించింది.
![]() |
![]() |