ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొబ్బరిపువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 10:50 PM

కొబ్బరిచెట్టులోని ప్రతి భాగం మనకి ఎలానో ఒకలా ఉపయోగపడుతుంది. కొబ్బరికాయ, కొబ్బరినీరు, కొబ్బరి ఇలా ప్రతి ఒక్క భాగం చాలా మంచిది. అలానే కొబ్బరి పువ్వు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి పువ్వులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు కొబ్బరి పువ్వుకి ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఈ పువ్వుని ఎక్కడ కనిపించినా చాలా మంది ఎక్కువగా తీసుకుంటూ తింటున్నారు.


కొబ్బరిపువ్వులోని పోషకాలు


కొబ్బరిపువ్వులో విటమిన్ సి ఉంటుంది. ఇది అన్ని శరీర కణజాలా పెరుగుదల, అభివృద్ధి, మరమ్మత్తుకు అవసరం. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి అనేక ముఖ్య ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికల్ని పెంచి మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలి నష్టం నుండి కణాలను రక్షిస్తాయి. వీటితోపాటు కాల్షియం, పాస్ఫరస్, పొటాషియం, ఫైబర్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి.


షుగర్ తగ్గేందుకు


షుగర్ అనేది దీర్ఘకాలిక సమస్య. కాబట్టి, కొబ్బరి పువ్వు తింటే ఇన్సులిన్ సెన్సేషన్‌ని సంతృప్తి పరిచి నియంత్రిస్తుంది. ఈ పువ్వుని తింటే రక్తంలో చక్కెర తగ్గడమే కాకుండా, బ్రెయిన్, ఎముకలకి చాలా మంచిది. కొబ్బరి పిండిని కూడా మనం వాడొచ్చు. దీనిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. గోధుమ, మొక్కజొన్న వంటి పిండితో పోలిస్తే ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి, షుగర్ ఉన్నవారికి చాలా మంచిది.


ప్రెగ్నెన్సీలో


కొబ్బరిని పువ్వుని తీసుకోవడం వల్ల గర్భాశయ శుభ్రతకి మంచిది. గర్భధారణ సమయంలో గర్భాశయ ఆరోగయానికి చాలా మంచిది. వెన్నునొప్పి కూడా తగ్గుతుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే వెన్నునొప్పిని తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. అదే విధంగా, కొబ్బరిపూలలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దీని కారణంగా జీర్ణక్రియ మెరుగవుతుంది. చర్మం, జుట్టుని కూడా చక్కగా, అందంగా చేస్తుంది. గర్భధారణ టైమ్‌లో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వచ్చే జుట్టు, చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి.కొబ్బరిపూలలో సంతానోత్పత్తిని పెంచే గుణాలు ఉన్నాయి.


గుండె జబ్బులకి


కొబ్బరిపువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇందులో ఫైబర్, పొటాషియంలు ఉంటాయి కొబ్బరి పూలని తినడం వల్ల ఎక్కువ బరువు ఉన్నవారిలో రక్తంలో రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అధిక రక్తంలో చక్కెర, అధిక కొలెస్ట్రాల్ రెండూ గుండె జబ్బులకి కారణాలు. కాబట్టి, కొబ్బరిని తింటే ఈ రెండూ కూడా పరిష్కారమవుతాయి.


బరువు తగ్గేందుకు


కొబ్బరిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వెయిట్ మేనేజ్‌మెంట్‌లో హెల్ప్ అవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల కొబ్బరి పువ్వులోని పుప్పొడి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు కొబ్బరి నీరు కడుపుని చల్లబరుస్తుంది. గ్యాస్ట్రిక్, ఇతర సమస్యల్ని తగ్గిస్తుంది. మూత్రాశయాన్ని క్లీన్ చేస్తుంది. కొబ్బరినీరు మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది. మూత్ర ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. దీంతో సహజంగా వ్యాధికారక క్రిములను బయటికి పంపుతుంది.


క్యాన్సర్ కణాలకి వ్యతిరేకంగా


కొబ్బరిపువ్వులోని గుణాలు క్యాన్సర్ కణాలను ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్‌ని తగ్గిస్తుంది. కాబట్టి, క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. అదే విధంగా, కొంతమంది ఆడవారికి పీరియడ్స్ టైమ్‌లో చాలా సమస్యలొస్తాయి. వాటిని దూరం చేయడానికి కొబ్బరి పువ్వు హెల్ప్ చేస్తుంది. రక్తస్రావాన్ని సరిచేస్తుంది. శరీర వేడి తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఈ కొబ్బరి పువ్వు తింటే థైరాయిడ్ కూడా తగ్గుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com