బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. ఇందులో పేపైన్ అనే జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని తేలికగా జీర్ణించేందుకు సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్, నీటి శాతం పేగుల కదలికను ఉత్తేజింపజేస్తుంది. రోజు ఓ ముక్క బొప్పాయి తీసుకుంటే మలబద్ధకాన్ని సమర్థవంతంగా నివారించవచ్చు.వీటిని రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా మలబద్ధక సమస్యను తగ్గించుకోవచ్చు. పండ్లతో పాటు తగినంత నీరు త్రాగటం, రోజూ వ్యాయామం చేయటం కూడా చాలా అవసరం. ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్, ఫైబర్ లేని ఆహారాన్ని తీసుకోవడం మలబద్ధకానికి కారణం కావచ్చు. అందువల్ల సహజమైన, ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లను ఎంచుకోవడం వల్ల ఈ సమస్య నుంచి మెల్లగా ఉపశమనం పొందవచ్చు.
![]() |
![]() |