దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ప్రతిరోజూ క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ మ్యాచ్‌లు మజా అందిస్తున్నాయి. వీకెండ్‌లలో డబుల్ హెడర్‌లను ఫ్యాన్స్ మరింత ఎంజాయ్ చేస్తున్నారు. గత నెల 22 నుంచి ప్రారంభమైన ఐపీఎల్ 18వ సీజన్ మే 25 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో తాజాగా కృత్రిమ మేధ సాయంతో ఐపీఎల్ నేపథ్యంలో రూపొందించిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియోలో ఇండియాలోని టాప్ పొలిటిషియన్స్ వివిధ ఐపీఎల్ టీమ్‌ల జెర్సీలు ధరించి మైదానంలో దిగడం ఉంది. ప్రధాని మోదీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (పంజాబ్ కింగ్స్), సోనియా గాంధీ (లక్నో సూపర్ జెయింట్స్) మంత్రులు అమిత్ షా (చెన్నై సూపర్ కింగ్స్), రాజ్‌నాథ్ సింగ్ (గుజరాత్ టైటాన్స్), నిర్మలా సీతారామన్ (రాజస్థాన్ రాయల్స్), జైశంకర్ (ఎస్ఆర్‌హెచ్), బెంగాల్ సీఎం మమత బెనర్జీ (కోల్‌కతా నైట్ రైడర్స్), ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ క్యాపిటల్స్), దేవేంద్ర ఫడ్నవీస్ (ముంబయి ఇండియన్స్) వీడియోలో ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఐపీఎల్ జెర్సీలు నేతలకు కరెక్ట్‌గా సరిపోయాయని కామెంట్లు చేస్తున్నారు.
![]() |
![]() |