అస్సాంలోని గౌహతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడిని అతడి తల్లి ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. బాలుడు కనిపించడం లేదని తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బాలుడి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి పొదల్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
గౌహతి డీసీపీ మృణాల్ డేకా ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం, బాలుడి తల్లి ప్రియుడు ఈ హత్యకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఈ ఘటనలో తల్లి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |