రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వం విస్తృత ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐటీ పరిశ్రమల స్థాపనకు చర్యలు వేగవంతం చేయబడుతున్నాయని తెలిపారు. దీని ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయని ఆయన అన్నారు.
ప్రజలకు ఉద్యోగ అవకాశాలు అందించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని, తద్వారా ఆర్థికంగా బలమైన సమాజాన్ని నిర్మించగలమని మంత్రి తెలిపారు. ఇటువంటి జాబ్ మేళాలు యువతకు మెరుగైన భవిష్యత్తును అందించడంలో కీలకంగా మారతాయని పేర్కొన్నారు.
![]() |
![]() |