పెనుకొండ పట్టణంలోని వైయస్సార్ కాలనీ వాసులు తాగునీటి సమస్యతో విసిగి, మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి సోమవారం మంత్రివర్యులు సవితమ్మకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు తమ కాలనీలో నెలకొన్న తాగునీటి కొరతతో పడుతున్న ఇబ్బందులను వివరించారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి సవితమ్మ వెంటనే స్పందించారు. తాగునీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కాలనీలో ఉన్న ఇతర సమస్యలపై కూడా తమ దృష్టి ఉంది పేర్కొంటూ, వాటన్నిటికీ త్వరలో శాశ్వత పరిష్కారం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "గత ప్రభుత్వం వైయస్సార్ పేరుతో కాలనీ ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడి ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది," అని వ్యాఖ్యానించారు. తాను మాత్రం ప్రజల బాగోగుల్ని ముందుగా ఉంచుకొని పని చేస్తానని స్పష్టం చేశారు.
![]() |
![]() |