రామగిరి మండలం నసన కోట గ్రామంలో ఈనెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 5రోజులపాటు నిర్వహించనున్న నసనకోట దుర్గమ్మ అమ్మ వారి ఉత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ, "భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాల ఏర్పాట్లు నిర్వహించాలి" అని అధికారులకు ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు.
ఈ ఉత్సవాలు రామగిరి మండలానికి ఎంతో ప్రాముఖ్యమైనవి కావడంతో, భక్తుల తరపున కూడా మంచి ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
![]() |
![]() |