తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సోమవారం స్వామి వారిని 68,760 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.90 కోట్లు వచ్చింది.
![]() |
![]() |