AP: జనసేన నేతలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపరేషన్ ‘సిందూర్’తో పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పిన మన దేశ సైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీకనకదుర్గమ్మకు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటకలోని ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ ఆధ్వర్యంలో నేతలు అర్చన, అభిషేకాల చేశారు.
![]() |
![]() |