ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్ర కేబినెట్ తొలి భేటీ రేపు జరగనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటయ్యింది. తాజా భద్రతా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
స్వదేశీయ భద్రతను బలోపేతం చేయడంపై, సైనిక దళాల సన్నద్ధతపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన నివేదికలు, భవిష్యత్ వ్యూహాల రూపకల్పనలో ఈ సమావేశం కీలకంగా నిలవనుంది.
ఈ కేబినెట్ సమావేశంలో ఇతర ముఖ్య ప్రభుత్వ రంగ అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే భద్రతా అంశాలు ఈసారి ప్రధాన అజెండాగా ఉండనున్నాయని సమాచారం.
![]() |
![]() |