జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు యువకులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక మరో ముగ్గురు బాలికలతో కలిసి సమీప గ్రామంలో వివాహ కార్యక్రమానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆరుగురు యువకులు వారి వెంట పడగా బాధిత బాలిక వారికి చిక్కింది. దీంతో వారు ఆ బాలికను అడవికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం బాలిక చనిపోయిందని అక్కడే వదిలేసి పారిపోయారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు యువకులను పట్టుకున్నారు.
![]() |
![]() |