మాజీ ఎంపీ కేశినేని నానికి విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని శివనాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ(మంగళవారం) ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో మీడియాతో కేశినేని శివనాథ్ మాట్లాడుతూ...... తాను ధైర్యంగా మీడియా ముందుకు వస్తున్నానని తెలిపారు. ధైర్యం లేని జగన్ తొత్తులందరూ మీడియా ముందుకు రాకుండా ఫేస్‌బుక్‌లోకి వస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ ఎద్దేవా చేశారు.ఒక్కసారైనా మీడియా ముందుకు కేశినేని నాని వచ్చారా అని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నించారు. తాము, చంద్రబాబు నాయుడు సైనికులం నిజం నిర్భయంగా చెప్పగలమని ఉద్ఘాటించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోమోహన్ రెడ్డి కక్కుర్తి సొమ్ముకు అలవాటు పడిన వ్యక్తులం కాదని హెచ్చరించారు. జగన్ తొత్తులకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
![]() |
![]() |