తిరుపతి జిల్లాలోని పోలీసు సహకార సొసైటీలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయి. సొసైటీ నుంచి కొంతమంది పోలీసు సిబ్బంది రుణాలు తీసుకున్నారు. వీటిని సకాలంలో వారు చెల్లించారు. అయితే వారు చెల్లించిన నగదు మాత్రం పోలీసు సహకార సొసైటీలో జమ కాలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డబ్బులు జమకాకపోవడంతో పోలీసు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆధారాలు దొరకకుండా డేటాను మార్చే ప్రయత్నాలు కూడా జరిగి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆడిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులు అందరి వివరాలు సేకరించి ఎవరి ఖాతా నుంచి ఎంతమేరకు నగదు మాయమైందో కనిపెట్టాలని ఆదేశించారు. ఆర్థిక నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేలినట్లయితే దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. తమ జీతాల నుంచే ఈ రుణాలను తీసుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |