ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూ మార్పిడి చట్టం రద్దు చెయ్యండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 12:54 PM

వ్యవసాయేతర ప్రయోజనాల కోసం భూ మార్పిడి చట్టం-2006ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ ఛాంబర్స్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఏపీ ఛాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తామని మార్చి 27న సీఎం ప్రకటించారని, దీంతో పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ చట్టం (వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి)ను రద్దు చేయడం వల్ల పెట్టుబడులు త్వరగా కార్యరూపం దాలుస్తాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని భాస్కరరావు ఆ లేఖలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com