ఏపీకి కేంద్రబృందం ఇవాళ(మంగళవారం) రానున్నారు. సీఎం చంద్రబాబుతో కేంద్రబృందం సమావేశం కానున్నారు. ఏపీలో నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో మాట్లాడనున్నారు. దుగరాజపట్నంలో నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై చర్చించనున్నారు. అలాగే ఇవాళ(మే13) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈమేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఈరోజు మధ్యాహ్నం 12.00 గంటలకు ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. 12.00 గంటలకు ఆదాయార్జన శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 03.45 గంటలకు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్షించనున్నారు. సాయంత్రం 06.30 గంటలకు సచివాలయం నుంచి హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. 07.00 గంటలకు చీఫ్ జస్టిస్‌తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. 07.40 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోనున్నారు.
![]() |
![]() |