కేశినేని హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్‌పై అప్పు తెచ్చిన మాజీ ఎంపీ కేశినేని నాని బ్యాంకుకు లోన్ ఎగ్గొట్టారని తెలుగుదేశం అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఆరోపించారు. ఇవాళ(మంగళవారం) టీడీపీ కార్యాలయంలో నాగుల్ మీరా మాట్లాడారు. కేశినేని నాని త్వరలో జైలుకు వెళ్తారని హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేశినేని నాని ఇద్దరు ఒకే సెల్‌లో ఉంటారని విమర్శించారు. బ్యాంకులకు డబ్బులు ఎగొట్టి, వాటిని షెల్ కంపెనీలకు మళ్లిస్తున్నారని నాగుల్ మీరా ఆరోపణలు చేశారు.హోటల్ డైరెక్టర్లను మార్చేసి, కూతుళ్ల పేరుతో కేశినేని నాని ఆంధ్ర రెస్టారెంట్‌ను అదే హోటల్లో నడుపుతున్నారని నాగుల్ మీరా ఆరోపించారు. ఆయన ఆర్ధిక నేరాలపై సీబీఐ, ఈడీలతో ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసూయ, ఆక్రోశంతో కేశినేని నాని తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేశినేని నాని అహంకారంతో తల్లి, చెల్లి, స్నేహితులందరినీ దూరం చేసుకుని ఒంటరయ్యాడని నాగుల్‌మీరా విమర్శలు చేశారు.
![]() |
![]() |