వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ గడువు ముగిసిన నేపథ్యంలో, మంగళవారం ఉదయం ఆయనను పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, వంశీ రిమాండ్‌ను బుధవారం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఆయనను పోలీసులు తిరిగి జిల్లా జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో వంశీకి పలుమార్లు రిమాండ్ విధించగా, తాజాగా మరోసారి కొనసాగడంతో ఆయన ఆశలు ఆవిరయ్యాయి.
![]() |
![]() |