ఈనెల 15వ తేదీన అనంతపురం జిల్లాలోని గుత్తి మండలంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. బేతపల్లి గ్రామంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. గుత్తిలోని ఓ ప్రైవేట్ కళాశాల వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలకు ఆయా అంశాలపై మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేయనున్నారు.
![]() |
![]() |