చైనాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హాలీడే కోసం ఓ జంట కలిసి ఓ హోటల్‌కి వెళ్లింది. అక్కడ చెకిన్ సమయంలో ప్రియురాలి ఫోన్ హోటల్ వైఫైకి ఆటోమెటిక్‌గా కనెక్ట్ అయింది. ఇది చూసిన ప్రియుడు షాక్‌కు గురయ్యాడు. "నీవు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చావ్ కదా! నాకు చెప్పకుండా?" అంటూ అనుమానంతో ఆమెపై కోపంగా మారిపోయాడు.
ఆమె ఎంతగా తన నిర్దోషిత్వాన్ని నమ్మించడానికి ప్రయత్నించినా అతను వినలేదు. చివరికి హోటల్ సిబ్బందిని కలిపి విచారణ జరిపించారు. విచారణలో ఆమె ముందుగా ఆ హోటల్‌లో నిలుచోలేదని స్పష్టమవడంతో ఆమె నిర్దోషిగా తేలింది.
అయితే, తనను నమ్మకుండా అనుమానించిన ప్రియుడిపై ఆమె తీవ్రంగా నిరాశ చెందింది. చివరికి అతనితోనే బ్రేకప్ చెప్పింది. ఒక ఆటో వైఫై కనెక్షన్.. ఓ ప్రేమకథ ముగింపుకి దారి తీసింది.
![]() |
![]() |