వైసీపీ మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతుందని, వైసీపీలో ఉన్న ప్రతి మహిళా ఒక సత్యభామ లాగా నారావారి నరకాసుర పాలనను ముగించడానికి నడుం బిగించాంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచకాలు, అత్యాచారాలు, అవమానాలు, అగత్యాలు, అక్రమ కేసులు, వేధింపులు ఇవే సీఎం చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్‌లంటూ పేర్కొన్నారు. సొంత పార్టీవాళ్లనే కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు.వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏమేమి హామీలు ఇచ్చారు.. ఏమేమి నెరవేర్చారో అందరికీ తెలుసన్నారు.. ప్రతీ కుటుంబం గత ప్రభుత్వ హయాంలో లబ్ది పొందారు.. కూటమి ప్రభుత్వం ఆ పార్టీ మహిళలను కూడా మోసం చేసిందని మండిపడ్డారు.. ఉగ్రవాదులకు మనకు మధ్య జరిగిన యుద్ధంలో ముందుంది నడిపిందే మహిళలు అని ప్రశంసించారు రోజా.. అయితే, సోషల్ మీడియాలో మహిళలను ఎలా టార్గెట్ చేయాలో టీడీపీ వాళ్లు నేర్పిస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. కానీ, అధికారంలో ఉన్నా.. లేకున్నా జగనన్న ఎప్పుడూ మహిళలకు అండగా ఉంటారని వ్యాఖ్యానించారు
![]() |
![]() |