వచ్చేనెల 3న మాడుగుల శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాడుగులలోని పి ఆర్ అతిధి గృహం వద్ద ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. ఉత్సవాన్ని జయప్రదం చేసే విధంగా ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
![]() |
![]() |