తిరుమలలో భక్తుల ఆహార భద్రత కోసం టీటీడీ ఒక ప్రత్యేకమైన ఫుడ్‌సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా టీటీడీ చర్యలు చేపడుతోంది. తిరుమలలో ఆహారంలో కల్తీని అరికట్టడానికి, నాణ్యతను పెంచడానికి ఈ కొత్త విభాగం పనిచేస్తుంది. సంప్రదాయ ఆహార పదార్థాలను మాత్రమే విక్రయించాలని ఇటీవలే టీటీడీ అధికారులు సూచించారు. ఈ క్రమంలోనే నిరంతర తనిఖీల కోసం టీటీడీకి ప్రత్యేక ఫుడ్‌సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa