విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో తమకు కావాల్సినంత సంఖ్యాబలం ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.అయన మాట్లాడుతూ.... "డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోవడంలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. గత రాత్రి 11 గంటలకు ఆ పదవిని జనసేన పార్టీకి కేటాయించాలని నిర్ణయించాం" అని పల్లా తెలిపారు. టీడీపీలో కూడా ఆ పదవిని ఆశించేవారు ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ఎన్నిక వాయిదా పడటానికి సమన్వయ లోపం కూడా ఒక కారణమని, అందుకే ఈ ఇబ్బంది తలెత్తిందని ఆయన అంగీకరించారు. జీవీఎంసీ కౌన్సిల్‌కు సభ్యులంతా హాజరవుతారని, దీనికి తాను పూర్తి బాధ్యత వహిస్తానని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.రేపు జరగనున్న ఎన్నికకు సభ్యులందరూ హాజరై, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసేలా చూడాలని పార్టీ శ్రేణులకు అధిష్ఠానం నుంచి గట్టి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
![]() |
![]() |