వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని టీటీడీ పాలకమండలి సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత భానుప్రకాశ్ రెడ్డి ఆరోపణలు చేశారు. టీటీడీని డబ్బు సంపాదించే సంస్థగా మార్చేసి, స్వామివారి ఖజానాకు గత పాలకులు భారీగా నష్టం చేకూర్చారని మండిపడ్డారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించే తులాభారం కానుకల నగదును కూడా కొందరు సిబ్బంది దొంగిలించారని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ ఎస్పీని కోరినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా తాను విజిలెన్స్ ఎస్పీకి అందజేశానని చెప్పారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో జరిగిన వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని కూడా కోరినట్లు ఆయన వెల్లడించారు.
![]() |
![]() |