టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వివిధ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ భేటీ అనంతరం షమీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. "ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసే గౌరవప్రదమైన అవకాశం నాకు లభించింది. మా చర్చలు దార్శనికత, నాయకత్వం, మన రాష్ట్ర పరివర్తన అవకాశాలపై దృష్టి సారించిన అంతర్దృష్టులతో సమృద్ధిగా సాగాయి. స్థిరమైన అభివృద్ధి, సామాజిక పురోగతిని నొక్కి చెబుతూ, వృద్ధికి ఒక బలమైన రోడ్‌మ్యాప్‌ను ముఖ్యమంత్రి వివరించారు. ఇది సమాజాలను శక్తివంతం చేయడంలో ఆయన నిబద్ధత లోతుగా ప్రతిధ్వనిస్తుంది. అలాగే సానుకూల మార్పుకు దోహదపడేలా మనందరినీ ప్రేరేపిస్తుంది. మన సమాజాభివృద్ధికి ఇంత అంకితభావంతో పనిచేసే సీఎం ఉండటం ప్రజలకు ఎంతో భరోసానిస్తుంది. ఉత్తరప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్తు వైపు ఈ సహకార ప్రయాణంలో భాగం కావడానికి నేను ఆసక్తిగా ఉన్నాను" అని షమీ తన ఇన్‌స్టా స్టోరిలో రాసుకొచ్చాడు.
![]() |
![]() |