ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన, అసాధారణమైన రికార్డును టీమిండియా స్టార్ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ ప్రస్తుత సారథి శ్రేయస్ అయ్యర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలకు నాయకత్వం వహించి, వాటన్నింటినీ ప్లేఆఫ్స్‌కు చేర్చిన మొట్టమొదటి కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం నాడు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను విజయపథంలో నడిపించి, జట్టుకు ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేయడం ద్వారా అయ్యర్ ఈ ఘనతను అందుకున్నాడు.
![]() |
![]() |